హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లగ్జరీ హై-రైజ్ ప్రాజెక్ట్ అయిన ‘సిన్క్’ను ఆవిష్కరించిన రాఘవ

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ తమ తాజా ప్రాజెక్ట్, సింక్ బై రాఘవను ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 17 April 2025 5:15 PM IST

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లగ్జరీ హై-రైజ్ ప్రాజెక్ట్ అయిన ‘సిన్క్’ను ఆవిష్కరించిన రాఘవ

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ తమ తాజా ప్రాజెక్ట్, సింక్ బై రాఘవను ప్రకటించింది. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది.

హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాఘవ ‘సిన్క్’ ఐదు 61 అంతస్తుల టవర్లు కలిగి ఉంది, ఇవి అత్యున్నతమైన హై-ఎండ్ 4 BHK నివాసాలను అందిస్తాయి. కొనుగోలుదారుల కోసం జాగ్రత్తగా రూపొందించబడిన ప్రతి ఇల్లు, లైటింగ్ , భద్రత కోసం తెలివైన ఇంటి ఆటోమేషన్ ద్వారా విశాలమైన జీవనాన్ని అందిస్తుంది. సిన్క్ లోని ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ‘ది ఒయాసిస్’ - పార్టీ ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్ మరియు పిల్లల కోసం ఆట స్థలాలను కలిగి ఉన్న బహుళ-అంచెల రెసిడెన్షియల్ ప్రాంగణం. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి టవర్‌లో పికిల్‌బాల్ కోర్టులు, పార్టీ డెక్ మరియు యోగా డెక్‌తో కూడిన స్కై లాంజ్ కూడా ఉంది.

ఈ ప్రాజెక్ట్ ప్రముఖ వ్యాపార కేంద్రాలు, ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఆసుపత్రులు మరియు విశ్రాంతి , వినోద గమ్యస్థానాలను సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది ఉన్న ప్రాంతం శక్తివంతమైన పట్టణ కనెక్టివిటీ మరియు ప్రశాంతమైన, క్యూరేటెడ్ జీవనశైలి మధ్య పరిపూర్ణ సమతుల్యతను చాటుతుంది.

రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష రెడ్డి పొంగులేటి మాట్లాడుతూ, “సింక్ బై రాఘవ మరొక నివాస సముదాయం మాత్రమే కాదు; ఇది ఒక హై-ఎండ్ ఆర్కిటెక్చరల్ అద్భుతం, సూక్ష్మ అంశాల పట్ల కూడా అమిత శ్రద్ధ చూపుతూనే ప్రపంచ స్థాయి మెటిరీయల్స్ తో రూపొందించబడింది. ఇది హైదరాబాద్ యొక్క పెరుగుతున్న స్కైలైన్‌కు మా నివాళి” అని అన్నారు

“ఈ ప్రాజెక్ట్‌లోని ప్రతి అంశం అంటే, డిజైన్, ఫినిష్ , ఫీచర్స్ పరంగా ఆధునిక గృహ కొనుగోలుదారుల అభివృద్ధి చెందుతున్న జీవనశైలికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవనశైలి అనుభవాన్ని మరింత పెంచడానికి తీర్చిదిద్దబడింది. ప్రాజెక్ట్ యొక్క వ్యూహాత్మక స్థానం దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. బంధాలు ఏర్పడే మరియు జ్ఞాపకాలు సృష్టించబడే ప్రదేశం ఇల్లు అని మేము రాఘవ వద్ద నమ్ముతున్నాము. ఈ విలువలను నిలబెట్టే ప్రాంగణాలను మేము నిర్మిస్తాము. ఇది మా ప్రాజెక్టులలో ప్రతిబింబిస్తుంది. సింక్ బై రాఘవ అందుకు మినహాయింపు కాదు ” అని ఆయన జోడించారు.

గ్రీన్ బిల్డింగ్ పద్ధతులు మరియు అసాధారణమైన నగర వీక్షణ దృశ్యాలతో తీర్చిదిద్దిన సింక్ ఆధునిక లగ్జరీ మరియు పర్యావరణ అనుకూల పట్టణ జీవనానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

Next Story