ఐటీఐ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అవకాశాలను అందించడానికి హెచ్‌సీసీబీ, డీఈటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సిసిబి), రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటిఐ) కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఆచరణాత్మక సాంకేతిక శిక్షణ మరియు పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డిఈటి)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 Nov 2025 8:22 PM IST

ఐటీఐ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అవకాశాలను అందించడానికి హెచ్‌సీసీబీ, డీఈటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సిసిబి), రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటిఐ) కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఆచరణాత్మక సాంకేతిక శిక్షణ మరియు పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డిఈటి)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.

హైదరాబాద్‌లోని డిఈటి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటి) జాయింట్ డైరెక్టర్ ఎస్.వి.కె. నగేష్ మరియు హెచ్‌సిసిబి క్లస్టర్ హెచ్ ఆర్ హెడ్ బి. తిరుపతి రావు సంతకాలు చేసి అవగాహన ఒప్పందం మార్చుకున్నారు. తెలంగాణ అంతటా హెచ్‌సిసిబి ఫ్యాక్టరీలు మరియు కార్యాలయాలలో స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌లను సాధ్యం చేయడం ద్వారా తరగతి గది అభ్యాసం , పారిశ్రామిక అప్లికేషన్ మధ్య నైపుణ్య అంతరాన్ని తగ్గించడం ఈ ఎంఓయు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం శిక్షణార్థులకు వాస్తవ ప్రపంచ కార్యకలాపాలు, ప్రక్రియ సామర్థ్యం, భారీ స్థాయి తయారీ వాతావరణంలో భద్రత, నాణ్యత మరియు పర్యావరణ పరిరక్షణ పరంగా ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడంపై దృష్టి పెడుతుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ డైరెక్టరేట్ (డీఈటి) జాయింట్ డైరెక్టర్ ఎస్.వి.కె. నగేష్ మాట్లాడుతూ, “బలమైన కార్యాచరణ మరియు శిక్షణ ప్రమాణాలకు పేరుగాంచిన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం, ఐటిఐ విద్యార్థులకు ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలు, ప్రక్రియలు మరియు పని సంస్కృతిని పరిచయం చేయడం ద్వారా వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది. భారతదేశ తయారీ రంగం యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తీర్చిదిద్దడంలో ఇటువంటి భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి” అని అన్నారు.

హెచ్‌సిసిబి హెచ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ - నిఖిల్ అరోరా మాట్లాడుతూ “హెచ్‌సిసిబి వద్ద , యువతకు సాధికారత కల్పించడంలో మరియు సమ్మిళిత వృద్ధిని నిర్మించడంలో నైపుణ్య అభివృద్ధి కీలకమని మేము గుర్తించాము. ఈ భాగస్వామ్యం ద్వారా, ఐటిఐ విద్యార్థులకు వారి విద్యా పాఠ్యాంశాలను సంపూర్ణం చేసే ఆచరణాత్మక అభ్యాస అవకాశాలను అందించడం, తయారీ, అనుబంధ రంగాలలో ప్రతిఫలదాయకమైన కెరీర్‌లను కొనసాగించడానికి వారిని ప్రేరేపించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. తరగతి గదుల నుండి షాప్ ఫ్లోర్‌ల వరకు అర్థవంతమైన మార్గాలను సృష్టించడానికి తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డిఈటి)తో కలిసి పనిచేయడం మాకు సంతోషంగా వుంది” అని అన్నారు.

ఈ అవగాహన ఒప్పందం రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది, పరిశ్రమ-విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి డీఈటి మరియు హెచ్‌సిసిబి మధ్య నిరంతర అనుసంధానతను సులభతరం చేస్తుంది. భారతదేశం వ్యాప్తంగా నైపుణ్య అభివృద్ధి, యువత సాధికారత మరియు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి హెచ్‌సిసిబి యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.

Next Story