దారుణం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నటుడి భార్య

Mollywood actor Ullas Pandalam's wife found dead at home. కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ మళయాళ నటుడు ఉల్లాస్ పందళం భార్య

By అంజి  Published on  20 Dec 2022 8:48 AM GMT
దారుణం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నటుడి భార్య

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ మళయాళ నటుడు ఉల్లాస్ పందళం భార్య ఆశా(38) ఇంట్లో శవమై కనిపించింది. తన భార్య కనిపించడం లేదంటూ ఉల్లాస్ పందళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలించగా ఇంటి పై అంతస్తులో ఆశా శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్లాస్ ఇంట్లో ఉండగానే ఆశా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉల్లాస్ పందళం ఇంట్లో వెతికినప్పుడు ఇది గమనించకపోవచ్చని పోలీసులు తేల్చారు. ఇటీవలే వీరు కొత్త ఇల్లు మారారు.

విదేశాల్లో ఉన్న ఉల్లాస్ కొద్ది రోజుల క్రితమే దేశానికి వచ్చాడు. ఉల్లాస్, అతని భార్య ఆశల మధ్య సోమవారం చిన్నపాటి గొడవ జరిగినట్లు దర్యాప్తు బృందం పేర్కొంది. ఆశా రాత్రి ఇంటి మేడ గదిలో తన పిల్లలతో కలిసి నిద్రించడానికి వెళ్లిందని ఉల్లాస్ భావించాడు. అయితే కొంత సేపటికి మేడమీద గదికి చేరుకుని చూడగా, పిల్లలతో పాటు భార్య కనిపించలేదు. ఇంటిలోని మిగతా గదులు, పరిసరాలన్నీ వెతికినా ఆశ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.

చివరకు ఆశా మృతదేహం ఇంటిపై అంతస్తులో కనుగొనబడింది. ఆశా మృతదేహాన్ని అదూర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. ఉల్లాస్ పందళం టెలివిజన్ ఛానెళ్లలో వివిధ కామెడీ షోలు, సినిమాల ద్వారా మలయాళీలకు సుపరిచితుడైన నటుడు. నటుడు ఉల్లాస్ పందళం, ఆయన భార్య మధ్య ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని ఉల్లాస్ పందళం మామగారు అన్నారు. సోమవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడానని, ఎలాంటి సమస్యలు చెప్పలేదని ఆశా తండ్రి శివానందన్ మీడియాకు తెలిపారు.

Next Story
Share it