ఆర్కే బీచ్‌లో ఎత్తైన ఇసుక బకెట్‌ను ఆవిష్కరించిన కేఎఫ్‌సీ

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ అంటేనే ఎన్నెన్నో విశేషాలు- ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఉదయపు నడకలు, సాయంత్రపు విహారాలు, అప్పుడప్పుడు కనిపించే ఇసుక కోటల సమాహారం.కానీ ఈ వారం, ఇసుకతో భారీ పరిమాణంలో కేఎఫ్‌సీ బకెట్ ఒకటి ఆవిర్భవించడంతో బీచ్‌కు వచ్చినవారు ఆశ్చర్యానికి లోనయ్యారు.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 25 March 2026 9:46 PM IST

ఆర్కే బీచ్‌లో ఎత్తైన ఇసుక బకెట్‌ను ఆవిష్కరించిన కేఎఫ్‌సీ

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ అంటేనే ఎన్నెన్నో విశేషాలు- ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఉదయపు నడకలు, సాయంత్రపు విహారాలు, అప్పుడప్పుడు కనిపించే ఇసుక కోటల సమాహారం.కానీ ఈ వారం, ఇసుకతో భారీ పరిమాణంలో కేఎఫ్‌సీ బకెట్ ఒకటి ఆవిర్భవించడంతో బీచ్‌కు వచ్చినవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. స్థానిక స్యాండ్ ఆర్టిస్ట్ ఆకునూరు బాలాజీ వరప్రసాద్ కేవలం బీచ్ ఇసుకను మాత్రమే ఉపయోగించి, 48 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించేందుకు 7టన్నులకు పైగా ఇసుకను వినియోగించారు. ఈ కళాఖండం ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్ చిహ్నాలలో ఒకటిగా మార్చింది.ఆకునూరు బాలాజీ వరప్రసాద్ శిల్పి మరియు ఒక ప్రఖ్యాత స్యాండ్ ఆర్టిస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పేరుపాలెం, మంగినపూడి, బాపట్ల బీచ్‌లతో పాటు భారతదేశంలోని పలు బీచ్‌లలో 700కు పైగా ఇసుక శిల్పాలను రూపొందించారు. ఆయన కోనార్క్ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవంలో నాలుగుసార్లు విజేతగా నిలిచారు. ఖతార్, యూరప్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ స్యాండ్ ఆర్ట్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

బీచ్ రోడ్‌లో కేఎఫ్‌సీ తన సరికొత్త రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శిల్పాన్ని రూపొందించారు. దీనితో విశాఖపట్నంలోని ఈ సుపరిచితమైన ప్రదేశం ఒక ఆకర్షణీయమైన ఫోటో స్పాట్‌గా మారింది. ఆసక్తిగల సందర్శకులు నిరంతరం ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకునేందుకు, వీడియోలు చిత్రీకరించుకునేందుకు, ఈ ఊహించని దృశ్యాన్ని ఆన్‌లైన్‌లో స్నేహితులతో పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు.

విశాఖపట్నానికి ఉన్న విశాలమైన సముద్రతీరం నేపథ్యంలో 2,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 సీట్ల సామర్థ్యం గల ఈ రెస్టారెంట్ తన సముద్ర సంబంధిత పరిసరాల నుంచి ప్రేరణ పొందింది. ఈ ప్రదేశానికి ప్రధాన ఆకర్షణగా పడవ స్ఫూర్తితో చేసిన అలంకరణ, వెదురుతో కప్పబడిన ముఖభాగం, సముద్రం వైపు చూసే సీటింగ్ ఉన్నాయి. ఇవి బీచ్‌కు వచ్చేవారు సేదతీరి, నోరూరించే ఆహారాన్ని ఆస్వాదించేందుకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

అలల ఒడ్డున విహరించిన తర్వాత, బీచ్‌కు వెళ్లేవారు తమకు ఇష్టమైన హాట్ & క్రిస్పీ చికెన్, హాట్ వింగ్స్, చికెన్ పాప్‌కార్న్, పెరి పెరి బోన్‌లెస్ స్ట్రిప్స్, జింగర్ బర్గర్స్, రోల్స్, రైస్ బౌల్జ్ తదితర కేఎఫ్‌సీ వంటకాలను ఆరగించేందుకు ఈ కొత్త రెస్టారెంట్ ఒక సరైన గమ్యస్థానం.

బీచ్ రోడ్‌లో కొత్తగా ప్రారంభమైన ఇది, నగరంలో 14వ కేఎఫ్‌సీ రెస్టారెంట్. మరి వైజాగ్ వాసులారా, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కేఎఫ్‌సీ బీచ్ రోడ్‌కు వచ్చి, మీరే స్వయంగా అనుభూతి చెందండి.

Next Story