కేరళలో ట్రాఫిక్ పోలీసుల కోసం సోలార్ గొడుగులు.. మండే ఎండల నుండి ఉపశమనం
Kerala police unveils solar umbrella for its traffic personnel. ఎండ వేడిమి నుంచి ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రక్షణ కల్పించేందుకు కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండుతున్న ఎండల్లో ట్రాఫిక్ పోలీసు
ఎండ వేడిమి నుంచి ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రక్షణ కల్పించేందుకు కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండుతున్న ఎండల్లో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు, అధికారులకు సోలార్ గొడుగులు ఇచ్చే కార్యక్రమాన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర పోలీసులు బుధవారం ప్రారంభించారు. సౌరశక్తితో నడిచే ఫ్యాన్‌ని కలిగి ఉన్న గొడుగు అధికారులకు విధుల్లో ఉన్నప్పుడు వేడి నుండి ఉపశమనం ఇస్తుంది. జిల్లా పోలీసు చీఫ్ (కొచ్చి నగరం) ఐజి సిహెచ్ నాగరాజు ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది.
ఇది డిప్యూటీ కమిషనర్ (లా & ఆర్డర్ మరియు ట్రాఫిక్) ఐశ్వర్య డోంగ్రే పర్యవేక్షణలో అమలు చేయబడింది. కొచ్చి ఇన్నర్ వీల్ క్లబ్, గిరిధర్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో ఈ గొడుగులను పంపిణీ చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో నగరంలోని ఐదు చోట్ల సోలార్ గొడుగులను ఏర్పాటు చేస్తున్నారు. లోపల అమర్చిన ఫ్యాన్‌తో కూడిన భారీ గొడుగు పైన అమర్చిన సోలార్ ప్యానెల్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌తో పని చేస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. కాగా సొలార్ గొడుగుల ద్వారా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కాస్తా అయినా ఉపశమనం పొందుతారు.