ప్రయాణికుడి ఛాతీపై తన్ని.. బస్సులోంచి తోసేసిన కండక్టర్‌

Karnataka passenger attacked by bus conductor. కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు.

By అంజి  Published on  8 Sep 2022 2:31 PM GMT
ప్రయాణికుడి ఛాతీపై తన్ని.. బస్సులోంచి తోసేసిన కండక్టర్‌

కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బస్సు ఎక్కడాని ప్రయాణికుడితో కండక్టర్ గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా ప్రయాణికుడి గొడుగును బయటకు విసిరేశాడు. అనంతరం ప్రయాణికుడి ఛాతీపై కాలితో తన్ని.. బలవంతంగా బయటకు నెట్టేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా పూత్తూరు సమీపంలోని ఈశ్వరమంగళలో ఈ అవమానీయ ఘటన చోటు చేసుకుంది.

బస్సు దిగాలని చెబుతూ.. కండక్టర్ ప్రయాణికుడిపై చేయితో దాడి చేశాడు. కండక్టర్‌ తన్నడంతో ప్రయాణికుడు రోడ్డుపై పడిపోయాడు. అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కండక్టర్‌ తీరుపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో, బస్సు ఆపరేటర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన బస్సు నంబర్ KA21F0002 కండక్టర్ సుబ్బరాజ్ రాయ్‌గా గుర్తించారు. అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. "బస్సులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఏ కండక్టర్‌కు లేదు. కండక్టర్‌ చేసింది తప్పేనని తెలుస్తోంది. అందుకే అతడిని వెంటనే సర్వీసు నుంచి సస్పెండ్ చేశాం.'' అని పుత్తూరు కేఎస్‌ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ జయకర శెట్టి అన్నారు.


Next Story
Share it