కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్ధన్‌రెడ్డి.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ

Karnataka mining baron Gali Janardhan Reddy floats his own party. కర్ణాటక మైనింగ్ వ్యాపారి, గతంలో వివాదాల్లో చిక్కుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)

By అంజి  Published on  25 Dec 2022 9:30 AM GMT
కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్ధన్‌రెడ్డి.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ

కర్ణాటక మైనింగ్ వ్యాపారి, గతంలో వివాదాల్లో చిక్కుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ 'కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష' ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ''ఇది కొత్త రాజకీయ ఎపిసోడ్‌. కళ్యాణ కర్నాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను, రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్తాను. రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రజలను విభజించి, పరిణామాల నుండి లబ్ది పొందాలని ప్రయత్నిస్తే, కర్ణాటకలో అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా ఐక్యంగానే ఉన్నారు'' అని అన్నారు.

తాను బీజేపీ సభ్యుడిని కాదని చెప్పారు. చాలా మంది తాను బీజేపీ సభ్యుడనే అనుకుంటున్నారని, ఆ ప్రచారానికి నేటితో తెరదించుతున్నాని అన్నారు. బీజేపీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ మంత్రి శ్రీరాములుతో విభేదాల ఊహాగానాలను గాలి జనార్దన్ రెడ్డి కూడా తోసిపుచ్చారు. ''నాకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవు. శ్రీరాములు చిన్నప్పటి నుంచి ఆప్తమిత్రుడని, ఇంకా మంచి అనుబంధం కొనసాగిస్తాం'' అని అన్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లినప్పటి నుంచి ఆయనకు బీజేపీ నేతలతో విభేదాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అతడు 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడు. బెయిల్ మంజూరు చేస్తూనే, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడపలను సందర్శించకుండా నిషేధిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్‌లో అనేక షరతులు విధించింది. ఇటీవల అక్టోబరులో గాలి జనార్దన్ రెడ్డి అనుమతి కోరిన తరువాత, బళ్లారి సందర్శించడానికి, నవంబర్ 6 వరకు తన కుమార్తెను కలవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.

Next Story