నెల్లూరులో కొత్త ఔట్లెట్‌తో తమ ఉనికిని శక్తివంతం చేసిన జావా ఎజ్డీ మోటార్ సైకిల్
నెల్లూరులోని తమ కొత్త డీలర్ షిప్ ను ప్రారంభించి జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ ఆంధ్రప్రదేశ్ లో తమ రిటైల్ ఔట్లెట్ ల సంఖ్యను పెంచింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
నెల్లూరులోని తమ కొత్త డీలర్ షిప్ ను ప్రారంభించి జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ ఆంధ్రప్రదేశ్ లో తమ రిటైల్ ఔట్లెట్ ల సంఖ్యను పెంచింది. దేశంలోనే అత్యధికంగా టూ వీలర్స్ విక్రయాల్లో భాగంగా ఉన్న ఆగ్నేయ భారత దేశంలో తమ ఉనికిని శక్తివంతం చేస్తోంది. ఈ కొత్త ఔట్లెట్,హనుమాన్ సాయి & కోతో, కంపెనీ రాష్ట్రానికి చెందిన రైడర్స్ కు నమ్మకమైన ఆఫ్టర్ సేల్స్ సంరక్షణ అందిస్తామని కీలకమైన వాగ్దానాన్ని వినియోగదారులకు అందచేసింది.
ఆంధ్రప్రదేశ్ లో క్లాసిక్ మోటార్ సైకిల్స్ పట్ల ఆసక్తి గల వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న అత్యంత విలక్షణమైన మోటార్ సైక్లింగ్ ఆకర్షణ అనేది దాని విభిన్నమైన భూ ప్రాంతం మరియు కోస్తా మార్గాలు ప్రత్యేక కారణాలుగా నిలిచాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, అటవీ కారిడార్లు, సముద్రం వైపుగా ఉన్న మార్గాలు ఎక్కువ దూరాలు,ఆకర్షణీయమైన ప్రయాణాలను కోరుకునే వారిని ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో కొత్తగా ప్రారంభించబడిన ఈ డీలర్ షిప్ , మైపాడు బీచ్ సమీపంలోని అందమైన కోస్తా రహదారులకు దగ్గరలో ఉండటం, పులికాట్ సరస్సు యొక్క ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, మరియు శ్రీకాళహస్తి ఆలయం వైపుగా దారి తీసే ఆధ్యాత్మికమైన మార్గాలు ఈ ప్రాంతంలో మోటార్ సైకిల్ ఔత్సాహికులతో శక్తివంతమైన సంబంధాన్ని రూపొందించడానికి బ్రాండ్ కు వీలు కల్పించాయి.
అనుపమ్ థరేజ, జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ సహ స్థాపకులు ఇలా అన్నారు," కీలకమైన జాతీయ రహదారుల నుండి కోస్తా మార్గాలు వరకు ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ఆకర్షణీయమైన కొన్ని రైడింగ్ మార్గాల్లో నెల్లూరు నెలకొంది. డిజైన్,వ్యక్తిత్వం, సామర్థ్యం ఒకే చోట కలిసిన నియో - క్లాసిక్ మోటార్ సైకిల్స్ కోసం ఇది ఆదర్శవంతమైన ఏర్పాటు. ఈ కొత్త డీలర్ షిప్ అనేది రైడర్స్ కు సమీపంలో ఉండటమే కాకుండా ఆ అనుభవాలను సమగ్రంగా అందిస్తోంది..”
స్థిరమైన ఆఫ్టర్ సేల్స్ మద్దతు ఇవ్వడానికి మరియు దీర్ఘకాలిక యాజమాన్య సంతృప్తి పట్ల తనకున్న తనకున్న దృఢమైన నిబద్ధతతో, శక్తివంతం చేయబడిన డీలర్ నెట్వర్క్ జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ తమ పెర్ఫార్మెన్స్ క్లాసిక్ బయ్యర్లకు అడ్డంకులు లేని యాజమాన్య ప్రయాణాన్ని అందచేయడానికి వీలు కల్పించింది. సమర్ధవంతమైన సర్వీసింగ్, వాస్తవమైన యాక్ససరీస్, అనుకూలమైన ఆప్షన్స్, మరియు శిక్షణ పొందిన సాకేతిక మద్దతు ద్వారా సమర్థించబడిన ప్రీమియం కొనుగోలు అనుభవాన్ని ఇవ్వడానికి కొత్త 3s ( సేల్స్, సర్వీస్, స్పేర్స్) ఔట్ లెట్ రూపొందించబడింది.
నిరంతరంగా, హెరిటేజ్, సామర్థ్యం, మరియు నమ్మకాలను మిశ్రమం చేసిన ఉన్నతమైన నాణ్యతను అందచేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ వారి దృఢమైన నెట్ వర్క్ లో హనుమాన్ సాయి & కో చేరింది. అన్ని 3S సదుపాయాలతో ఉన్న విధంగానే, శిక్షణ పొందిన టెక్నీషియన్స్, ఆధునిక సాధనాలు మరియు కంపెనీ వారి శ్రేణిలోనే మొట్ట మొదటి కస్టమర్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా డీలర్ షిప్ కు మద్దతు లభిస్తోంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ కింది సదుపాయాలు అందిస్తోంది:
· 4-సంవత్సరాలు/50,000-కిమీ స్టాండర్డ్ వారంటీ
6 సంవత్సరాల వరకు ఎక్స్ టెండెడ్ వారంటీ ఆప్షన్స్
ఒక ఏడాది వరకు రోడ్ సైడ్ సహాయం
450+ సేల్స్ వద్ద సమగ్రమైన మద్దతు మరియు దేశవ్యాప్తంగా సర్వీస్ టత్ పాయింట్స్
ఇంజనీరింగ్ శ్రేష్టత మరియు దీర్ఘకాలం ఉత్పత్తి యొక్క విశ్వశనీయత పట్ల కంపెనీ వారి నిబద్ధతను శ్రేణిలోనే ఈ మొట్ట మొదటి కార్యక్రమం సూచిస్తోంది, ప్రతి రైడర్ విచారరహితమైన యాజమాన్య ప్రయాణాన్ని ఆనందించడానికి హామీవహిస్తోంది.