ఐసీసీ పురుషుల, మహిళల టోర్నమెంట్ల కోసం ప్రీమియర్ పార్టనర్‌గా హ్యుందాయ్ మోటార్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో గ్లోబల్ పార్టనర్‌షిప్‌ను ప్రకటించింది. దీని ద్వారా 2026 నుండి 2027 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్ల కోసం 'ప్రీమియర్ పార్టనర్'గా మారింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో గ్లోబల్ పార్టనర్‌షిప్‌ను ప్రకటించింది. దీని ద్వారా 2026 నుండి 2027 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్ల కోసం 'ప్రీమియర్ పార్టనర్'గా మారింది.
ప్రీమియర్ పార్టనర్‌గా, ఐసీసీ యొక్క రాబోయే అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు హ్యుందాయ్ మోటార్ ప్రత్యేక హక్కులను, అవకాశాలను పొందుతుంది. ఇందులో మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2027 కూడా ఉంది. ఈ హక్కులలో టాస్ వంటి ఐకానిక్ మ్యాచ్‌డే క్షణాలలో పాల్గొనడం, స్టేడియంలో ప్రముఖ బ్రాండింగ్‌ను పొందడం, ప్రత్యేకమైన ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్‌లను అందించడం వంటివి ఉన్నాయి.
క్రీడల పట్ల ఉన్న ఉమ్మడి అభిరుచి ద్వారా విభిన్న ప్రపంచ ప్రేక్షకులతో లోతైన బంధాలను నిర్మించుకోవడానికి హ్యుందాయ్ మోటార్ నిబద్ధతను ఈ భాగస్వామ్యం నొక్కి చెబుతుంది. క్రికెట్ ఒక సాంస్కృతిక వేడుకగా ఉన్న భారత్ వంటి కీలక మార్కెట్లలో బ్రాండ్ ఉనికిని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ & సీఈఓ జోస్ మునిజ్ మాట్లాడుతూ: "క్రికెట్, హ్యుందాయ్ రెండూ మెరుగుపడాలనే నిరంతర ఆశయాన్ని, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే పట్టుదల ను పంచుకుంటాయి. ఐసీసీతో భాగస్వామ్యం కావడం ద్వారా, మేము ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది అభిమానులతో కనెక్ట్ అవ్వడమే కాకుండా, వారి అభిరుచిని, ఉత్సాహాన్ని ప్రతిబింబించే కొత్త మొబిలిటీ అనుభవాలను అందించడానికి కృషి చేస్తున్నాము."
ఐసీసీ ఛైర్మన్ జే షా మాట్లాడుతూ: "ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. దీనికి రెండు వందల కోట్ల (2 బిలియన్ల) మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్ల సమయంలో వీరి ఆసక్తి, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గ్లోబల్ ఈవెంట్లు... వినూత్న డిజిటల్, ఇన్-స్టేడియం అనుసంధానాల ద్వారా అభిమానులతో మమేకం కావడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మా ప్రీమియర్ పార్టనర్‌గా హ్యుందాయ్‌ను స్వాగతిస్తున్నాము, కలిసి అత్యుత్తమ ఈవెంట్లను నిర్వహించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. హ్యుందాయ్ అనేది క్రీడలకు ఎంతో కాలంగా మద్దతు ఇస్తున్న ఒక గ్లోబల్ బ్రాండ్. ఈ ఈవెంట్లలో మా ఉమ్మడి బలాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము."
ఈ భాగస్వామ్యం ఎందుకు ప్రత్యేకం?
ఈ భాగస్వామ్యం క్రికెట్ ప్రపంచంలో హ్యుందాయ్ మోటార్ స్థానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. 2011 నుండి 2015 వరకు ఐసీసీతో ఉన్న ప్రాథమిక సహకారం తర్వాత, హ్యుందాయ్ తిరిగి ఈ క్రీడలోకి అడుగుపెట్టడాన్ని ఇది సూచిస్తుంది.
ఐసీసీ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు హ్యుందాయ్ మోటార్ యొక్క వినూత్న విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. ఇంటరాక్టివ్ ఫ్యాన్ జోన్లు, వెహికల్ షోకేస్‌లు (వాహన ప్రదర్శనలు), డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇవి మద్దతుదారుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
క్రికెట్ పట్ల అత్యంత మక్కువ ఉన్న దేశాల్లో జరిగే వివిధ ఫార్మాట్లలోని ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్లన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుంది.
హ్యుందాయ్ మోటార్ తన గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రాటజీలో క్రికెట్‌పై ఎందుకు దృష్టి సారిస్తోంది?
హ్యుందాయ్ మోటార్ తన విస్తృతమైన స్పోర్ట్స్ పార్టనర్‌షిప్ వ్యూహంలో భాగంగా ఐసీసీతో జతకట్టింది. ప్రతి ప్రాంతంలో సాంస్కృతికంగా ప్రాముఖ్యత ఉన్న క్రీడలతో మమేకం కావడానికి ఈ వ్యూహం ప్రాధాన్యతనిస్తుంది. రెండు వందల కోట్లకు పైగా ఉన్న ప్రపంచ ప్రేక్షకుల సంఖ్యతో, క్రికెట్ ఈ బ్రాండ్‌కు విశాలమైన, ఉత్సాహభరితమైన ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
భారతదేశంలోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హ్యుందాయ్ మోటార్, ఐసీసీ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ (డెసిగ్నేట్) తరుణ్ గార్గ మాట్లాడుతూ: "ఈ భాగస్వామ్యం భారతదేశం పట్ల హ్యుందాయ్‌కు ఉన్న బలమైన నిబద్ధతను, హ్యుందాయ్ గ్లోబల్ కార్యకలాపాలలో భారత మార్కెట్ పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. మేము కొన్ని థ్రిల్లింగ్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈ అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకోవడానికి పీఆర్ (PR), డిజిటల్, ఎక్స్‌పీరియెన్షియల్, డీలర్‌షిప్‌ల అంతటా 360-డిగ్రీల కమ్యూనికేషన్ విధానంతో మేము సిద్ధంగా ఉన్నాము."