హెల్మెట్‌ తెచ్చిన చిక్కు.. భార్య మారింది.. చివరికి

Helmet funny incident changed husband and wife.. Karnataka petrol station incident. ఓ భర్త.. తన భార్యను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడు. అయితే మధ్యలో బైక్‌లో పెట్రోల్‌ అయి

By అంజి  Published on  10 Feb 2023 11:23 AM IST
హెల్మెట్‌ తెచ్చిన చిక్కు.. భార్య మారింది.. చివరికి

ఓ భర్త.. తన భార్యను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడు. అయితే మధ్యలో బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో బంకుకు వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌ కొట్టించుకున్నాక, తన భార్య అనుకునే వేరే వాళ్ల ఆవిడను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడా వ్యక్తి. తీరా అతడు వెళ్తున్న దారిని చూసి అనుమానంతో 'ఏవండీ.. ఇటుకాదు కదా మన ఇల్లు' అని భర్తను అడిగింది. దీంతో భర్త వెనక్కి తిరిగి చూశాడు. బైక్‌పై కూర్చున్న మహిళ తన భార్య కాదని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ ఘటన కర్ణాటక హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం సాయంత్రం జరిగింది.

'ఏమండీ.. మన ఇల్లు ఇటు కాదు కదా.. ఇటువైపు ఎందుకు తీసుకువెళ్తున్నారు?' అని వెనుకు కూర్చున్న ఆ ఇల్లాలు తన భర్తను ప్రశ్నించింది. ఇంటికి వెళ్తుంటే.. ఇల్లు ఇటు కాదని మాట్లాడుతోంది ఏంటీ అని భర్త వెనక్కి తిరిగి చూశాడు. బైక్‌పై కూర్చున్న మహిళ తన భార్య కాదని తెలుసుకుని షాకయ్యాడు. పెట్రోల్‌ కొట్టించిన తర్వాత అక్కడే నిలబడి ఉన్న మహిళను భర్త బండి ఎక్కమన్నాడు. ఆ మహిళ కూడా పిలిచింది తన భర్తే అనుకుని బండి ఎక్కింది. తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండటంతో బైక్‌ ఎక్కిన మహిళ తన భార్యే అనుకున్నాడు సదరు వ్యక్తి.

భర్త లాంటి సౌష్ఠవం, అదే బైకు, ఒకే రంగు హెల్మెట్లు ఉండటంతో ఈమె కూడా పొరపాటు పడి బైక్ ఎక్కింది. పొరపాటు తెలుసుకున్న ఐదు నిమిషాలత తర్వాత తిరిగి ఆమెను అదే పెట్రోలు బంకు దగ్గరకు తీసుకొచ్చాడు. అప్పటికే ఆయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తున్నారు. నలుగురూ మొహం కప్పే హెల్మెట్లను ధరించి ఉండటంతో ఈ పొరపాటు జరిగిందని తెలుసుకుని, అక్కడున్నవారంతా కడుపుబ్బా నవ్వారు.

Next Story