'ఆ హిందూయేతర దుకాణాలను తొలగించండి'.. రాజాసింగ్‌ డిమాండ్‌

Evict non-Hindu shops at Murdeshwar temple, demands Raja Singh. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ముర్దేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ సస్పెండ్

By అంజి  Published on  24 Jan 2023 5:14 PM IST
ఆ హిందూయేతర దుకాణాలను తొలగించండి.. రాజాసింగ్‌ డిమాండ్‌

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ముర్దేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ సస్పెండ్ అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే టి రాజా సింగ్ బీచ్ సైడ్ సమీపంలో ఉన్న హిందూయేతర దుకాణాలను తొలగించాలని బీజేపీ ఆధ్వర్యంలోని కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. శివుని ఆశీర్వాదం కోసం ముర్దేశ్వర్‌ ఆలయానికి వచ్చిన రాజాసింగ్‌.. అక్కడే రెండు రోజుల బస చేశారు. అక్కడి ఉత్సాహభరితమైన బీచ్‌ వాతావారణాన్ని అస్వాదించారు.

ఏ నిర్దిష్ట మతం పేర్లను తీసుకోకుండా రాజాసింగ్ మాట్లాడుతూ.. ''హిందువులు కాని వారి స్వంత అనేక షెడ్‌లు ఇక్కడ వ్యాపారాన్ని స్థాపించాయి. వారు హిందువేతరులు. గొడ్డు మాంసం తింటారు. ఈ షెడ్లన్నీ అక్రమంగా భూమిని ఆక్రమించుకున్నవే. సముద్ర జంతువులను వేయించి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నేను ఏ మతం గురించి మాట్లాడుతున్నానో ఈపాటికి మీకు తెలిసి ఉండాలి'' అని అన్నారు.

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి హిజాబ్ విషయంలో వారు వ్యవహరించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని రాజా విజ్ఞప్తి చేశారు. ''ముఖ్యంగా దేవాలయాల దగ్గర అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో కూడా నాకు తెలుసు. ముర్డేశ్వర్ ఆలయాన్ని అక్రమ హిందూయేతర ఆక్రమణదారుల నుండి విముక్తి చేయాలని నేను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను'' అని అన్నారు.


Next Story