కాలేజీ స్టూడెంట్స్ 'లిప్ లాక్ ఛాలెంజ్'.. నెట్టింట వైరల్‌

College students host lip-lock challenge in Karnataka, one arrested. లిప్‌ లాక్‌ ఛాలెంజ్‌' పేరిట ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థులు రభస చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చర్చనీయాంశంగా మారింది.

By అంజి  Published on  21 July 2022 5:26 PM IST
కాలేజీ స్టూడెంట్స్ లిప్ లాక్ ఛాలెంజ్.. నెట్టింట వైరల్‌

మీరు సోషల్ మీడియాలో విభిన్న ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియోలను తప్పక చూసి ఉంటారు. సాధారణంగా ఈ వీడియోల్లో యువత వేరే ఏదైనా చేయమని ఇతరులకు ఛాలెంజ్ చేస్తారు. వేరొకరు ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేసినప్పుడు, అతను తన స్నేహితులలో మరొకరిని అదే విధంగా చేయమని సవాలు చేస్తాడు. ఇలాంటి ఛాలెంజ్‌లకు విభిన్నంగా కర్ణాటకలోని ఓ కాలేజీ విద్యార్థులు 'లిప్‌ లాక్‌ ఛాలెంజ్‌' చేసి వార్తల్లో నిలిచారు.

'లిప్‌ లాక్‌ ఛాలెంజ్‌' పేరిట ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థులు రభస చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రైవేట్‌ నివాసంలో యువతీయువకులు పోటీ పడి మరీ ముద్దులు పెట్టుకున్నారు. విద్యార్థుల లిప్‌లాక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం నాడు స్థానికంగా జరిగిన ఈ ఘటన వివాదాన్ని రేకెత్తించింది. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఒక విద్యార్థిని అరెస్టు చేశారు.

గదిలో ఉన్న ఇతరులు వారిని ఉత్సాహపరుస్తుండగా కాలేజీ అబ్బాయి, అమ్మాయి ముద్దులు పెట్టుకోవడం వీడియోలో చూపబడింది. విద్యార్థుల బృందం తమలో తాము లిప్ లాక్ పోటీని నిర్వహించుకున్నట్లు తెలిసింది. యూనిఫాంలో ఉన్న కాలేజీ విద్యార్థులు ఒకరినొకరు లిప్‌ లాక్‌ ఛాలెంజ్‌ పేరుతో సవాలు చేసుకోవడం వీడియోలో కనిపించింది. విద్యార్థులు ప్రముఖ కళాశాలకు చెందినవారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియోను ఇంట్లో ఉన్న విద్యార్థి ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని కూడా వర్గాలు తెలిపాయి. విద్యార్థులు డ్రగ్స్‌ సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story