పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేసిన ఎమ్మెల్యే
An MLA who cleaned the toilet of a government girls' school. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్.పి.వెంకటేశ్వర్లు ఇలితంపట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ
By అంజి Published on 7 Sep 2022 5:34 AM GMTతమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్.పి.వెంకటేశ్వర్లు ఇలితంపట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పాఠశాలలో అపరిశుభ్రతను గుర్తించిన ఎమ్మెల్యే.. పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధానాధికారికి సూచించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో కలిసి మరుగుదొడ్ల ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడికి చేరుకోగానే టాయిలెట్ నుంచి దుర్వాసన రావడంతో.. ఆయనే స్వయంగా శుభ్రం చేశారు. ఆ తర్వాత టాయిలెట్ క్లీనింగ్ ప్రెస్, బ్లీచింగ్ పౌడర్, పినాయిల్ కొనివ్వమని చెప్పి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ అధినేతకు చెప్పాడు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ''నిరుపేద పాఠశాల విద్యార్థినుల కోసం టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలి. నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఉపాధ్యాయులు పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లకు వాడే ఫినాయిల్ మీ దగ్గర లేకపోతే చెప్పండి. నేను కొనుగోలు చేస్తాను. క్లీనర్లు రాకపోతే చెప్పండి. నేనే శుభ్రం చేసి వెళ్లిపోతాను.'' అని అన్నారు. పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. పేద పాఠశాల విద్యార్థినులకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు తప్పనిసరి అని చెప్పారు.
పాఠశాల ఏరియాలో దోమలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి జిల్లా అభివృద్ధి అధికారిని సంప్రదించి పాఠశాల మొత్తం శుభ్రం చేయాలని సూచించారు. ఇంకా ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థినులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. క్లీనింగ్ సిబ్బందిని సక్రమంగా నియమించాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను తొలగించి నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కొత్త మరుగుదొడ్లను నిర్మించి పాఠశాల విద్యార్థినులకు ఉపయోగపడేలా శానిటరీ న్యాప్‌కిన్ డిస్పోజల్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.