తమిళనాడు రాష్ట్రం విల్లుపురం పరిధిలోని వానూరు పక్కన ఉన్న పెరంబాయిలో బాల సుబ్రహ్మణ్యం అనే భక్తుడు నిత్యానందస్వామికి 18 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. దాని పక్కనే ప్రఖ్యాత మలేసియాలోని ఆలయం మాదిరిగా 27 అడుగుల మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయానికి బటుమలై మురుగన్ అని పేరు పెట్టారు. ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. 18 అడుగుల ఎత్తైన నిత్యానందస్వామి విగ్రహానికి కుంబాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ నిత్యానంద విగ్రహాన్ని చూసి పోలీసు అధికారులు, ప్రజలు, భక్తులు అవాక్కయ్యారు. ఇదే విషయమై ఆలయంలో కుంభాభిషేకం శివాచార్యులను అడుగగా.. ఇది శివుని మరో అవతారమైన కాల భైరవ విగ్రహం, సరిగ్గా చెక్కకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. తర్వాత ఆలయ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రమణ్యం గదికి వెళ్లినప్పుడు నిత్యానంద ఆయనను ఆశీర్వదిస్తున్న పలు ఫొటోలు, ఆయన గదినిండా నిత్యానంద ఫొటోలు కనిపించాయి. కొంతమంది భక్తులు విగ్రహం ముందు నిలబడి ఫొటోలు దిగారు. కుంభాభిషేక ఆహ్వానపత్రికలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను చేర్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శివశంకర్ కెఎస్‌పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరి తర్వాత ఒకరు వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.