హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సెంటర్‌ను ప్రారంభించిన 1 ఫైనాన్స్

పారదర్శకమైన మరియు హైపర్-పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు కట్టుబడి ఉన్న భారతదేశంలోని అగ్రగామి వినియోగదారు ఆర్థిక సంస్థ అయిన 1 ఫైనాన్స్, హైదరాబాద్‌లో తమ కొత్త ఆర్థిక ప్రణాళిక కేంద్రాన్ని ప్రారంభించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 15 Sept 2025 7:32 PM IST

హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సెంటర్‌ను ప్రారంభించిన 1 ఫైనాన్స్

పారదర్శకమైన మరియు హైపర్-పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు కట్టుబడి ఉన్న భారతదేశంలోని అగ్రగామి వినియోగదారు ఆర్థిక సంస్థ అయిన 1 ఫైనాన్స్, హైదరాబాద్‌లో తమ కొత్త ఆర్థిక ప్రణాళిక కేంద్రాన్ని ప్రారంభించింది. థానే తర్వాత ఇది కంపెనీకి రెండవ కేంద్రం. ఉత్పత్తి అమ్మకాల కంటే క్లయింట్ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే నిష్పాక్షిక ఆర్థిక సలహాతో భారతీయులను శక్తివంతం చేయాలనే దాని లక్ష్యాన్ని ఈ కేంద్రం ప్రతిబింబిస్తుంది.

కంపెనీ లక్ష్యంను 1 ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ మెహతా వివరిస్తూ, “ నిపుణులు, వ్యవస్థాపకులు మరియు వ్యాపార కుటుంబాలకు హైదరాబాద్ నిలయం. వీరిలో చాలా మంది ఆర్థికంగా మహోన్నత ఆకాంక్షలు కలవారే కానీ నిజంగా సంఘర్షణ లేని సలహాలు పొందలేక పోతున్నారు. వీరికి మెరుగైన సలహాలు అందించటంతో పాటుగా , జీవితకాల సంబంధాలను నిర్మించడం 1 ఫైనాన్స్‌ వద్ద మా లక్ష్యం. ఇక్కడ సలహా నిష్పాక్షికంగా, సమగ్రంగా మరియు వ్యక్తిగతంగా ఉంటుంది” అని అన్నారు.

ఫైనాన్షియల్ ప్లానింగ్ సెంటర్ పెట్టుబడి మరియు పన్ను ప్రణాళిక నుండి భీమా, రుణాలు, పదవీ విరమణ మరియు వీలునామా మరియు ఎస్టేట్ ప్లానింగ్ వరకు సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది.

మెహతా మాట్లాడుతూ, “క్లయింట్లు స్పష్టత కోరుతూ మా కేంద్రంలోకి ప్రవేశించి స్పష్టత మరియు విశ్వాసంతో బయటకు వెళ్లాలని మేము కోరుకుంటున్నాము. మేము సృష్టించిన వాతావరణం ఇంటరాక్టివ్ గా , అందుబాటులో ఉంటుంది” అని అన్నారు.

సలహా సేవలకు మించి, హైదరాబాద్ కేంద్రం ఆర్థిక అక్షరాస్యత, అవగాహన కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తుంది, వర్క్‌షాప్‌లు, సెమినార్లు, చిన్న-సమూహ అభ్యాస సెషన్‌లను నిర్వహిస్తుంది. క్లయింట్లు మరియు కమ్యూనిటీలు 1 ఫైనాన్స్ యొక్క ప్రత్యేక వనరుల నుండి ప్రయోజనం పొందగలరు.

హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభించడం అనేది 1 ఫైనాన్స్ యొక్క విస్తరణ రోడ్‌మ్యాప్‌లో భాగం. సమీప భవిష్యత్తులో బెంగళూరు, పూణే మరియు ఢిల్లీ NCR లలో ఈ తరహా కేంద్రాలు రానున్నాయి.

Next Story