కేఫ్ టౌన్‌ : బౌలర్లలో ఒక్కొక్కరిది ఒకో స్టైల్ ఉంటుంది. కొందరు చాలా వైవిధ్యంగా బంతులు విసురుతారు. దక్షిణాఫ్రికా బౌలర్ గ్రెగొరి మలొక్వొనా తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కుడి, ఎడమ బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. దక్షిణప్రికాలో జరుగుతున్న మ్జాన్సీ సూపర్ లీగ్‌లో గ్రెగోరి తన బౌలింగ్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. కేప్‌ టౌన్ బౌలర్‌ గ్రెగొరి. మూడు ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి..రెండు వికెట్లు తీశాడు. కుడిచేత్తో బౌలింగ్ చేసి డర్బన్ ఓపెనర్‌ ఎర్వీని పెవిలియన్ దారి పట్టించాడు. తరువాత ఎడమ చేత్తో బౌలింగ్ చేసి కెప్టెన్ డేన్ విలాస్‌ను అవుట్ చేశాడు. రెండు చేతులతో బౌలింగ్ చేసి..రెండు చేతులతోవికెట్లు తీశాడు. తొలత బ్యాటింగ్ చేసిన కేప్‌ టౌన్ 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.