దాదా అంటే అంతే మరి.. పాకిస్థాన్ ఆటగాడి ఫోటోను లేపేశారుగా..!
By న్యూస్‌మీటర్ తెలుగు
సౌరవ్ గంగూలీ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఒకప్పుడు భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడానూ అంతే..! తాజాగా ఐపీఎల్ ను ఎటువంటి లోటు పాట్లు లేకుండా బయో బబుల్ లో నిర్వహించాలని దాదా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే షార్జాకు వెళ్లి స్టేడియంను పరిశీలించాడు.
అందుకు సంబంధించిన ఫోటోలను దాదా తన అధికారిక ఖాతాలో పోస్టు చేశాడు. అందులో ఓ ఫొటోలో హోర్డింగ్ కాస్త బ్లర్ చేసి ఉంది. ఇంతకూ ఆ హోర్డింగ్ లో ఏముందో తెలుసా..? పాకిస్థాన్ ఆటగాడి ఫోటో..! ఐపీఎల్ నిర్వహిస్తూ పాకిస్థాన్ ఆటగాడి ఫోటో దాదా దిగిన ఫోటోల్లో ఎందుకు అని అనుకున్నారో ఏమో.. బ్లర్ చేసి పారేశారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ మొదలయ్యే లోపు అక్కడ ఉన్న హోర్డింగ్ కూడా మార్చి వేస్తారు పక్కాగా..!
ఐపీఎల్ కోసం యుఏఈ వెళ్లిన గంగూలీ నిబంధనల ప్రకారం, క్వారంటైన్ ను ముగించుకుని, కరోనా టెస్ట్ తరువాత, తొలిసారిగా షార్జా క్రికెట్ స్టేడియాన్ని చూడడానికి వెళ్ళాడు. గంగూలీతో పాటు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, మాజీ ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా, సీఓఓ హేమాంగ్ అమిన్ లతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులు కూడా ఉన్నారు.
సౌరవ్ గంగూలీ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఓ హోర్డింగ్ ను మాత్రం గంగూలీ బ్లర్ చేసి అప్లోడ్ చేశారు. ఇంతకూ ఆ హోర్డింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా..? ఓ పాక్ క్రికెటర్..! దీంతో గంగూలీ ఆ ఫోటోను బ్లర్ చేసి అప్లోడ్ చేశాడు.
View this post on Instagram
Famous Sharjah stadium all set to host IPL 2020
A post shared by SOURAV GANGULY (@souravganguly) on