44 ఏళ్ల సూర్య.. 19ఏళ్ల వ్యక్తిగా.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 4:06 PM ISTవైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు సూర్య. పాత్ర అవసరాన్ని బట్టి రూపాన్ని మార్చుకునేందుకు ఏ మాత్రం వెనుకాడడు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా కోసం ఎన్నో సాహాసాలు చేశాడు. స్కూల్ బోయ్ లా.. మిడిలేజీ యువకుడిలా.. ఏజ్డ్ పర్సన్ గా రకరకాల గెటప్పుల్లో కనిపించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూర్యకి చాలా మంది అభిమానులు. తాజాగా సూర్య నటిస్తున్న చిత్రం సూరారైపోట్రు. తెలుగులో ఆకాశనే నీ హద్దురా పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి సుధా కొండగర దర్శకత్వం వహిస్తోంది.
శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్.. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో సూర్య.. 19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం ఎంతో హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. 44ఏళ్ల వయసున్న సూర్య 19 ఏళ్ల వ్యక్తిగా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తూ ఆ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ పాత్ర కోసం సూర్య ఎలాంటి కసరత్తులు చేశారు. ఎలాంటి డైట్ పాటించాడు అన్న విషయాలను అందులో చూపించారు.
సన్నగా కనిపించడానికి బరువును తగ్గించమని సూర్యను దర్శకురాలు సుధ కొంగర కోరారట. స్ప్రింటింగ్ .. పుషప్స్ చేయడం సహా భారీ బరువులు ఎత్తే వరకూ సూర్య ప్రతిదీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక బాడీ వెయిట్ ట్రైనింగ్ వీలున్న ప్రతి చోటా.. ఎప్పుడైనా చేసేవాడని సూర్య కమిట్ మెంట్ గురించి సుధ కొంగర చెబుతున్నారు. 19 ఏళ్ళ వయస్సు యువకుడిగా కనిపించేందుకు సూర్య శ్రమను చూసి తాను షాక్ అయ్యానని.. పాత్ర కోసం అతను చేసిన కృషి అంతా ఇంతా కాదని తెలిపారు.
అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్‌బాబు, జాకీష్రాఫ్, పరేశ్‌రావల్, సంపత్‌రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సూర్య కేవలం నాలుగు చొక్కాలు.. మూడు ప్యాంట్లు మాత్రమే ధరిస్తారని కాస్ట్యూమ్ డిజైనర్ వెల్లడించారు