కరోనా వైరస్‌ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ మహమ్మారి అన్ని రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెడుతుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వలస కూలీలు వేరే రాష్ట్రాల్లో ఉండిపోయారు. తినేందుకు తిండిలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ బియ్యం, పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున నగదు కూడా అందజేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Also Read :ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందు బాబులు..!

ఈ ప్రకటనపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోనూ సూద్‌ స్పందిసూ.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. ట్రూ లీడర్‌.. శాల్యూట్‌ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ తో పాటు కేసీఆర్‌ మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేస్తున్న వీడియోను జతపర్చాడు. సోనూసూద్‌ బాలీవుడ్‌ నటుడే అయినా తెలుగు పలు సినిమాలతో హీరో స్థాయిలో ఓ వెలుగు వెలిగాడు. ముఖ్యంగా సూపర్‌, కందిరీగ, అరుంధతి, దూకుడు వంటి సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్లు వేశారు. ప్రధానంగా సోనూసూద్‌ను అరుధంతి సినిమా తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్