సోనుసూద్‌కు అరుదైన గౌర‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2020 1:56 PM IST
సోనుసూద్‌కు అరుదైన గౌర‌వం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఎంతో మందికి కనీసం తినేందుకు మెతుకు కూడా లేకుండా చేసింది. అలాంటి సమయంలో అభాగ్యుల కోసం, వలసకూలీల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చారు నటుడు సోనుసూద్‌. వెండితెరపై విలన్‌గా నటించినా.. నిజజీవితంలో ఎందరికో హీరో అయ్యాడు. ఏ ప్రతిఫలం లేకుండా ఆయన అందించిన సాయం వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చింది. తమ వారితో కలసి కలో గంజో తాగేట్లు చేసింది.

ఆయన చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి.. అరుదైన పుర‌స్కారాన్ని ప్రకటించింది. ఐక్య‌రాజ్య‌స‌మిత అనుబంధ సంస్థ యునైటెడ్ నేష‌న్స్ డెవ‌లాప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనుసూద్‌కి ఎస్‌డీజీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుని అంద‌జేసింది. వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం ఈ అవార్డుని అందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐరాస పుర‌స్కారాన్ని అందుకున్న వారిలో హాలీవుడ్ స్టార్స్ ఏంజిలీనా జోలీ, డేవిడ్ బెక్‌హామ్‌, లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా వున్నారు. తాజాగా వీరి స‌ర‌స‌న సోనుసూద్ నిలిచారు. ఐరాస అవార్డు అందు కోస‌వ‌డం సంతోషంగా వుంద‌ని, త‌ను చేసిన సేవ‌ల్ని గుర్తించి అవార్డుని అందించార‌ని సోనుసూద్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

Next Story