కాబోయే సీఎం ఉద్ధవ్ థాకరేకు సోనియా లేఖ‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Nov 2019 6:38 PM IST
కాబోయే సీఎం ఉద్ధవ్ థాకరేకు సోనియా లేఖ‌..!

మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్న శివ‌సేన అధినేత‌ ఉద్ధవ్ థాకరే కు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ లేఖ రాశారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో తాను పాల్గొన‌లేన‌ని ఆ లేఖలో సోనియా పేర్కొన్నారు. సోనియా లేఖ‌లో.. ఉద్ధవ్ తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని ఆమె కోరారు.

Sonia Gandhi

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు గ‌డిచిన నెల‌రోజులుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మ‌రాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివ‌సేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించేందుకు ఉద్థవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే నిన్న ఢిల్లీ వెళ్లారు.

Next Story