'సోనాక్షి సిన్హా' ట్వీట్.. పాపం బాలయ్యకి ఇది అవమానమే !

By అంజి  Published on  16 Dec 2019 7:14 AM GMT
సోనాక్షి సిన్హా ట్వీట్.. పాపం బాలయ్యకి ఇది అవమానమే !

బాలీవుడ్ బబ్లీ హీరోయిన్ సోనాక్షి సిన్హా నందమూరి బాలకృష్ణ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తోందనే న్యూస్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా హాల్ చల్ చేస్తూనే ఉంది. ఎవరు పుట్టించారో గాని ఈ న్యూస్ కి సోనాక్షి సిన్హా కూడా భయపడినట్లు ఉంది. బాలయ్య పక్కన తనను హీరోయిన్ గా పెట్టేసి వార్తలు రాస్తుంటే.. అమ్మడు బాగా హార్ట్ అయిందటా. అందుకే ట్వీట్ చేసి మరి బాలయ్య బాబు సినిమాలో తానూ నటించట్లేదని పోస్ట్ చేసింది. అలాగే ఈ న్యూస్ పుట్టించిన వారి పై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.బాలయ్యబాబు పక్కన నటిస్తే స్టార్ వాల్యూ పడిపోతుందనే ఫీలింగ్ లో ఉందట సోనాక్షి సిన్హా. పాపం ఈ విషయం బాలయ్యకి తెలిస్తే.. ఏ రేంజ్ లో హార్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా ఎంత బాలీవుడ్ హీరోయిన్ అయితే మాత్రం.. బాలయ్య బాబు పేరు మెన్షన్ చేసి మరి.. ఆయన సినిమాలో యాక్ట్ చేయట్లేదని చెప్పాలా ? ఏమైనా బాలయ్య ఇక నుండి కొత్తగా ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు రెగ్యులర్ గా పడాల్సి వస్తోంది.

Sonakshi Sinha Tweet

అన్నట్లు బోయపాటి - బాలయ్య సినిమా జనవరి 22న నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, హీరో శ్రీకాంత్ ను సెకండ్ విలన్ గా తీసుకోవాలని మేకర్స్ ట్రై చేస్తున్నారు. మరి సంజయ్ దత్ అన్నా, బాలయ్య సినిమాకి ఒకే చెబుతాడా..? లేక, సోనాక్షి లాగే అవమానంలా ఫీల్ అవుతాడా ? చూడాలి.

ఈ చిత్రంలో ఒక హీరోయిన్ పాత్రకు కేథరీన్ థెరీసాని తీసుకోనున్నారట. అలాగే మరో అతిధి పాత్రలో హీరోయిన్ వేదిక కూడా కనిపించనుంది. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే బోయపాటి బాలయ్య కలయికలో వచ్చిన 'సింహ, లెజెండ్' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

Sonakshi Sinha Tweet

Next Story