క్రికెటర్‌కి కరోనా పాజిటివ్.. కండీషన్ సీరియస్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 12:20 PM GMT
క్రికెటర్‌కి కరోనా పాజిటివ్.. కండీషన్ సీరియస్..!

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. తాజాగా ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఫ‌స్ట్‌క్లాస్ క్రికెటర్ నిక్వెనీకి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. గత ఏడాదికాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్)తో ఇబ్బందిప‌డుతోన్న‌ ఈ 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో టెస్టులు చెయ్య‌గా కరోనా సోకినట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. క‌రోనా బారీన ప‌డ్డ మూడో క్రికెట‌ర్ ఇత‌ను. ఇంతకు ముందు పాక్​ క్రికెటర్​ జాఫర్​ సర్ఫరాజ్​, స్కాట్​లాండ్​కు చెందిన మజిద్ హక్​ కరోనా పాజిటివ్‌గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే.. చికిత్స పొందుతూ స‌ర్ఫ‌రాజ్ మృతి చెందాడు.

2012లో సౌతాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన సోలో న్వ్కేని‌ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ అదే ఆట‌తీరును కొనసాగించాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. 'గతేడాది నాకు జీబీఎస్​కు వచ్చింది. పది నెలలుగా ఈ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. టీబీ వచ్చింది, మూత్రపిండాలు, కాలేయం పాడయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్​గా తేలింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు'అంటూ త‌న ఆవేద‌న‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్య‌క్తం చేశాడు. నిక్వెనీ 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 1,627 పరుగులు, 56 వికెట్లు తీసాడు. ఇక 30 టీ20ల్లో 469 పరుగులు, 27 వికెట్లు కూల్చాడు.



Next Story