భారత సైనికులకు పాకిస్తాన్ కు చెందిన అమ్మాయిలు వల వేసినట్లు తెలుస్తోంది. దీనిపై పాక్ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ హస్తం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత భద్రతా రహస్యాలను తెలుసుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు చెందిన జవాన్లపై ఫేస్‌ బుక్‌ తో పాటు ఇంతర సోషల్ మీడియా ద్వారా పాక్‌ అమ్మాయిలు వలపు వల విసిరారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ హోంశాఖకు నివేదిక అందించింది. ఇటీవల నావికదళంలో హనీ ట్రాప్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

హనీ ట్రాప్‌ ద్వారా నేవీ సిబ్బంది నుంచి పాకిస్తాన్‌ కీలక సమాచారం సేకరించిందని ఇంటలిజెన్స్‌ దర్యాప్తులో తేలడంతో కేంద్రం హోంశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కుట్ర బయట పడటంతో కేంద్ర పారా మిలటరీ బలగాలకు చెందిన జవాన్లకు సోషల్ మీడియాతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది కేంద్రం. ఈ మేరకు భారత నావికాదళంలో సిబ్బందికి నేవీ శిబిరాలు, ఓడల్లో ఇప్పటికే సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్లను వినియోగించకుండా నిషేధం విధించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.