రంగారెడ్డి: చిన్నారి స్నేహిత కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్నేహిత అనే నాలుగు సంవ‌త్స‌రాల‌ చిన్నారి ఈ రోజు సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుంటే గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ యువకుడు చిన్నారి స్నేహితను ఐదు గంటల తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అనంతరం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకొని తమ కూతురిని దగ్గర చేర్చుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి బెంగళూర్ వెళ్లే జాతీయ రహాదారిపై చటాన్‌ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతంలో ఉన్న‌ అశియానా హోటల్ వద్ద.. కిడ్నాపర్ ఆన‌వాళ్ల‌ను పోలీసులు గుర్తించారు. స్నేహితను ప‌ల్స‌ర్ బైక్ ఫై కూర్చోబెట్టుకొని తీసుకొని వెళుతున్న దృశ్యాల‌ను ఆశియానా హోటల్ సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. కిడ్నాప‌ర్ స్నేహిత‌ను ఎటువైపు తీసుకెళ్లాడ‌నే కోణంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story