లైవ్ మ్యాచ్‌లోకి పాము ఎంట్రీ.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 4:23 PM GMT
లైవ్ మ్యాచ్‌లోకి పాము ఎంట్రీ.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

ఏపీలో నేటి నుండి రంజీ క్రికెట్‌ సందడి మొద‌లైంది. విజయవాడలోని మూలపాడులో ఆంధ్ర- విదర్భ జట్ల మధ్య రంజీ మ్యాచ్‌ జరుగుతోంది. అయితే.. మ్యాచ్ మొద‌లైన‌ కొద్దిసేప‌ట్లోనే మైదానంలోకి ఓ పాము ఎంట్రీ ఇచ్చింది. దీన్ని గ‌మ‌నించిన ఆట‌గాళ్లు అంపైర్ల‌కు సైగ చేయ‌డంతో.. అంపైర్లు మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.

అయితే.. వెంట‌నే అల‌ర్ట్ అయిన గ్రౌండ్ సిబ్బంది పామును బయటకు పంపడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఎట్ట‌కేల‌కు ఎలాగోలా పామును గ్రౌండ్ బ‌య‌టికి పంపారు. అయితే దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక‌ ట్విటర్ అకౌంట్ ద్వారా క్రికెట్‌ అభిమానులతో షేర్ చేసుకుంది.Next Story
Share it