టీమిండియా ఆట‌గాడు కేదార్‌ జాదవ్ వ‌రుస వైఫ‌ల్యాల‌తో జ‌ట్టులో సుస్థిర స్థానం ప‌దిలం చేసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2019లో జాదవ్ త‌న ఆట‌తీరుతో ఆక‌ట్టుకోలేదు. వ‌ర‌ల్డ్‌క‌ప్ మొత్తంలో సౌతాంప్టాన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేయ‌డం మినహా పెద్దగా రాణించలేదు. దీంతో అతనిపై వేటు తప్పలేదు.

 

 

View this post on Instagram

 

Feels good to be back on the field and do what I like to do. 🏏🙂 #ranjitrophy @sareen_sports

A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on

అయితే.. తాజాగా కేదార్ జాదవ్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటోపై టీమిండియా స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాదవ్‌తో ఉన్న ప్రెండ్‌షిప్ కొద్ది.. పోజు కొట్టడం ఆపి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్‌ చేశాడు. జాదవ్‌ పోస్ట్‌ చేసిన ఫోటోకు రోహిత్‌ శర్మ ఇలా కామెంట్ చేయ‌డంతో.. రోహిత్.. నిజంగానే జాద‌వ్‌ను మంద‌లించాడా..? అని క్రికెట్ అభిమానులు విస్తుపోతున్నారు. ఈ పోస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌ కూడా అయ్యింది.

Rohit Sharma

ఇదిలావుంటే.. జాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌ వన్డే కెరీర్‌లో రెండు సెంచరీలు, 6 అర్థ శతకాల్ని జాదవ్‌ సాధించాడు. అలాగే తొమ్మ‌ది టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో జాదవ్‌ను సెలక్టర్లు టీం సెల‌క్ష‌న్‌లో కనీసం పరిగ‌ణ‌లోకి కూడా తీసుకోవ‌డం లేదు. ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో కూడా జాదవ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ టోర్నిలో కూడా ఒక్క మ్యాచ్ లో అర్థ‌సెంచ‌రీ మిన‌హా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో సెల‌క్ట‌ర్లు జాద‌వ్‌ను పూర్తిగా మ‌రిచిపోయారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.