సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం..
By అంజిPublished on : 28 March 2020 12:43 PM IST

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ ఇంట్లోకి పాము దూరింది. పాము దూరిన సమయంలో సజ్జనార్ ఇంట్లోనే ఉన్నారు.
అయితే సజ్జనార్ పామును చంపకుండా వెంటనే హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు.
వెంటనే కానిస్టేబుల్ వెంకటేష్ అక్కడికి వచ్చి పామును పట్టుకున్నాడు. పామును చాక చక్యంగా పట్టుకున్నందుకు వెంకటేష్‌కు సీపీ సజ్జనార్ రివార్డు ఇచ్చారు.
వెంకటేష్ పాములను పట్టుకోవడంలో నిష్ణాతుడు. పట్టుకున్న పామును జూపార్క్ సిబ్బందికి అందజేశారు.
Next Story