ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్.!
By సుభాష్ Published on 9 May 2020 5:26 PM ISTఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ప్రతీ రోజు 50కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రకాశ్ నగర్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఒక కుటుంబంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
విజయవాడ మాచవరం డౌన్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కొడుకుని చూడడానికి తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌కు వచ్చాడు. ఆ వ్యక్తికి అనారోగ్యం కారణంగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆ అతను మరణించగా, తాడేపల్లి ప్రకాశ్ నగర్‌లో ఉంటున్న పెద్ద కుమారుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆలస్యంగా వెలుగు చూసింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న బంధుమిత్రులను దాదాపు 60 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
తాజా సమాచారం మేరకు.. తాడేపల్లి ప్రకాశ్ నగర్‌లోని ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.