ముఖ్యాంశాలు

  • దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటంపై ఆవేద‌న‌
  • దక్షిణాది సినీ ప్రముఖులతో మోదీ ఫోటోలు దిగకపోవడంతో అసహనం

ప్రధాని నరేంద్రమోదీపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

అయితే.. అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖులతో మోదీ ఫోటోలు దిగకపోవడంతో సినీ ప్రముఖులు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగా మోదీ తీరుపై విమర్శలు కురిపించారు.

దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై మరో ప్రముఖ నటుడు, గాయకుడు కూడా స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా హాజరయిన విషయం తెలిసిందే.

I am grateful to Ramoji Raoji, (Eenadu), because of whom I was able to attend a reception hosted by our Hon. Prime…

Posted by S. P. Balasubrahmanyam on Saturday, November 2, 2019

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.