విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్‌ జంట..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 6:18 AM GMT
విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్‌ జంట..

టాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'వెయ్యి అబద్దాలు' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఎస్తర్‌. టాలీవుడ్‌ సింగర్‌, నటుడు నోయల్‌ ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. గత ఏడాది చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

”చాలా రోజుల నిశ్శబ్దం తరువాత అధికారికంగా ఎస్తేర్‌తో నాకు విడాకులు అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నా. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాము. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్‌. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా” అని నోయల్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే ఇద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయాం. గతేడాది జూన్‌లోనే మ్యూచువల్‌ డైవర్స్‌కు అప్లైం చేశాం. అధికారికంగా వెల్లడించాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లు సైలైంట్‌గా ఉన్నానని ఎస్తేర్‌ తెలిపింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో క్లారిటీ ఇస్తున్నట్లు పేర్కొంది. చాలా విషయాల్లో సూటిగా-నిజాయితీగా ఉంటానని, కానీ ఈ విషయంలో మాత్రం ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని పేర్కొంది.

Next Story