యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు బాలీవుడ్‌కు తలనొప్పిగా మారింది. విదేశాలకు వెళ్లొచ్చి.. ఆ విషయాన్ని దాచిపెట్టిన సింగర్‌ కనిక కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇచ్చిన డిన్నర్‌ పార్టీకి వెళ్లిన వారికి ఇప్పుడు కరోనా వైరస్‌ టెస్టులు జరుగుతున్నాయి. మొత్తం 183 మందికి కరోనా వైరస్‌ టెస్టులు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఇందులో 63 మందికి కరోనా నెగిటివ్‌ అని తేలింది. తమకు కరోనా సోకలేదని తేలడంతో ఆ 63 మంది ఇక ఇళ్లకు పరిమితమయ్యారు. ఎక్కడకూ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

ఇక మిగతా 120 మందికి సంబంధించిన లిస్ట్‌ కూడా రెడీ అయ్యింది. వీరందరూ కూడా కనిక కపూర్‌కి పలు సందర్భాల్లో టచ్‌ అయ్యారని తెలిసింది. ఆమె దగ్గరగా ఉన్న వారందరీని నుంచి రక్త నమునాలు సేకరించి.. మహారాష్ట్రలోని కరోనా ల్యాబ్‌లకు పంపుతున్నారు. అయితే వీరందరికి కరోనా నెగిటివ్‌ వస్తే ఎలాంటి టెన్షన్‌ ఉండదు. ఒక వేళ పాజిటివ్‌ అని తేలితే మాత్రం.. మళ్లీ వారు ఎక్కడ తిరిగారు. ఎవరెవరితో కలిశారో.. వారందరికీ వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో కరోనా ఎఫెక్ట్ కన్నా కనిక ఎఫెక్టే ఎక్కువైయ్యింది. కనిక కలిసిన వారిలో ఎంపీలతో సహా బాలీవుడ్‌ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.

ఇటీవలే లండన్ వెళ్లిన కనికా ఈనెల 15వ తేదీన లక్నోకు చేరుకున్నారు. ఆదివారం ఆదివారం రాత్రి డిన్నర్‌ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ కు కరోనా సోకినట్లు నిర్థారణయింది. కనికా కపూర్ కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో..తాను కూడా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అవుతున్నట్లు తెలిపారు. కాగా..కనికా కపూర్ కు కరోనా వైరస్ ఉందని తెలియక అదే పార్టీలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఒకరు నిన్న రాజ్యసభ అంతా కలియతిరిగారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ ఎంపీలతో భయంతో వణికిపోతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.