కరోనా కాటుకు బలైన సింగర్..విషాదంలో అభిమానులు

By రాణి  Published on  30 March 2020 5:13 AM GMT
కరోనా కాటుకు బలైన సింగర్..విషాదంలో అభిమానులు

కరోనా వైరస్ కేవలం పేదవారికే సోకుతుందన్న నియమేమీ లేదు. ఎంత కోటీశ్వరులైనా సరే దీని బారిన పడే చావు అంచుల వరకూ వెళ్లినట్లే. రాత బావుంటే బతికి బయటపడతారు. ఆదివారం స్పెయిన్ రాణి కూడా కరోనా సోకి మృతి చెందిన విషయం విధితమే. తాజాగా అమెరికన్ సింగర్ జో డిఫీ (61) కూడా కరోనా కాటుకు బలయ్యారు. రెండ్రోజుల క్రితమే జో డిఫీ తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా..ఇంతలోనే ఆయన మృతి చెందారన్న వార్త రావడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read : మాంసం కూర వండలేదని మహిళ హత్య

అమెరికా జానపద సంగీతాన్ని జో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. పికప్ మ్యాన్, ప్రాప్ మీ ఆఫ్ బిసైడ్ ద జూక్‌బాక్స్, జాన్ డీర్ గ్రీన్ వంటి పాటలను జో ప్రపంచానికి పరిచయం చేశారు. 90 లలో అమెరికన్ జానపదాలతో సమాజాన్ని ఉర్రూతలూగించిన జో పలుమార్లు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్ష 75 వేలు దాటింది. ఆదివారం ఒక్కరోజే 17,500 కరోనా కేసులు నమోదవ్వగా..200 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read : పెళ్లాం చెప్తే వినాలి..మీ కళ్లకి గంతలు వీడాలి..

ఇటు భారత్ లో కూడా కరోనా సోకి ఐసోలేషన్ వార్డులో ఉన్న సింగర్ కనికా కపూర్ కు వరుసగా 4వ సారి పాజిటివ్ అనే వచ్చినట్లు వెద్యులు వెల్లడించారు. విదేశాల నుంచి ఇటీవలే లఖ్ నవూకి వచ్చిన కనికా ఇంట్లో ఉండకుండా వివిధ పార్టీలకు హాజరయ్యారు. కనికాకు కరోనా నిర్థారణవ్వడంతో..ఆమెతో కలిసి పార్టీల్లో పాల్గొన వారంతా కరోనా భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

Next Story