• జీడిమామిడి తోటలో సహజీవనం
  • పూటుగా తాగొచ్చిన నిందితుడు

మాంసం వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి మహిళను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం సిరిగిందలపాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో ఉన్న జీడిమామిడి తోటలో లక్ష్మీ, సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ లు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకే తోటలో ఉండటంతో..కలిసే ఉంటున్నారు. లక్ష్మికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. శనివారం రాత్రి పూటుగా తాగొచ్చిన వెంకటేష్ లక్ష్మితో గొడవ పడ్డాడు. మాంసం కూర ఎందుకు వండలేదని ప్రశ్నించగా..ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో మద్యం మత్తులో కోపంతో ఊగిపోయిన వెంకటేశ్ పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై మోదాడు. లక్ష్మి తలకు దెబ్బ బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రగాయాలతో ఆమె ఆదివారం ఉదయం మృతి చెందింది. ఇదంతా చూసిన లక్ష్మి కుమారుడు జరిగిన ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు.

Aloso Read : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.