సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా ధమాకా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 8:02 AM GMT
సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా ధమాకా..!

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు వారాల ముందుగానే దసరా కానుకను ప్రకటించారు. సంస్థ లాభాల్లో 28 శాతం బోనస్‌ అందజేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ చెల్లిస్తామని.. దీంతో ప్రతి కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారని తెలిపారు.

కార్మికుల సమన్వయంతోనే సింగరేణిలో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించామని సీఎం అన్నారు. గత ఐదేళ్లుగా సింగరేణి లాభాల బాటలో పయనిస్తూనే ఉందని.. 2018-19 సంవత్సరానికి రూ.1565 కోట్ల గరిష్ఠ లాభాన్ని సింగరేణి సంస్థ ఆర్జించిందని వెల్లడించారు. సంస్థ సాధిస్తున్న ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ప్రతీక అని కేసీఆర్ అన్నారు.

Next Story
Share it