స్టార్‌ షట్లర్‌ సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 2:25 AM GMT
స్టార్‌ షట్లర్‌ సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్‌

మహిళల డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ నేలకుర్తి సిక్కి రెడ్డి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఐదు నెలల విరామం తర్వాత.. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఈనెల 7న మొదలైన జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం మొద‌లైంది. భారత స్పోర్ట్స్‌ అథారిటీ నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కలిపి మొత్తం 20 మందికి మంగళవారం కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించారు.

ఈ శిబిరంలో పాల్గొంటున్న ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగెటివ్‌ ఫలితం రాగా.. సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌లకు కరోనా పాజిటివ్‌ తేలిందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్‌’ వివరించింది.

దీంతో శానిటైజ్‌ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ శుక్రవారం స్థానిక‌ ఆసుపత్రుల‌లో మరోసారి కోవిడ్‌ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. అలాగే సిక్కి రెడ్డి, కిరణ్‌ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయనున్నారు. ఇదిలావుంటే.. శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.

Next Story