సియాచిన్ లో టన్నుల చెత్త గుట్ట!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 8:10 AM GMT
సియాచిన్ లో టన్నుల చెత్త గుట్ట!

భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న అత్యంత ఎత్తైన సైనిక స్థావరం, సియాచెన్ గ్లేషియర్ పైన పేరుకుపోయిన టన్నుల చెత్త ను భారత ఆర్మీ తొలగించింది. సుమారు 130 టన్నుల ఘనరూపంలో ఉన్న చెత్తను తొలగించినట్టు సమాచారం.

అధికారిక సమాచారం ప్రకారం, సంవత్సరాలుగా, గుట్టలు గుట్టలుగా సుమారు 236 టన్నులకు పైగా చెత్త పేరుకుపోతుండటంతో అక్కడి వాతావరణం పాడవుతోంది. సియాచెన్ పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయ సైనికులు మెగా డ్రైవ్ ను చేపట్టి సుమారు 130 టన్నుల చెత్తను తొలగించింది.

వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇక్కడ చెత్త భూమిలో కలిసిపోదు, అందువల్ల గుట్టలుగా పేరుకుపోతుంది.

సియాచెన్ ఎత్తైన సైనిక స్థావరం. ఇక్కడ జవాన్లు, స్థానికులు తప్ప బయటివారికి ప్రవేశం లేదు. అయితే, త్వరలోనే సియాచెన్ ను పర్యాటకులను అనుమతించాలని భారత ఆర్మీ భావిస్తోంది.

Next Story