పరిమళించిన మానవత్వం..సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఎస్ఐ

By రాణి  Published on  15 April 2020 3:34 PM GMT
పరిమళించిన మానవత్వం..సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఎస్ఐ

మానవత్వం..కరోనా కారణంగా అందరిలో కాకపోయినా ఎందరో కొందరిలోనైనా ఇప్పుడిప్పుడే మానవత్వాన్ని చూడగలుగుతున్నాం. మామూలు రోజుల్లో మచ్చుకైనా కనిపించని మానవత్వం ఇప్పుడు పోలీసుల రూపంలో కనిపిస్తోంది. అత్యవసరంగా ఓ గర్భిణీకి డెలివరీ చేయల్సి ఉండగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ తో పాటు ఎలాంటి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేవు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోలీస్ వాహనంలో గర్భిణీ స్త్రీని ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డి పై నెటిజన్ల ఆగ్రహం..

పోలీసులంటే ప్రజల రక్షణే కాదు..ఆపద సమయాల్లో ఆదుకునే స్వభావమున్న వారు కూడా అని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూర్ (యం) మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన సుదగాని అనూష, భర్త హరికృష్ణ దంపతులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. అనూష గర్భిణీ కావడంతో అక్కడ డాక్టర్ ఆమెకు అత్యవసర డెలివరీ చేయాలని, వెంటనే భువనగిరి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కానీ ఆ సమయానికి అందుబాటులో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఎస్ఐ ఎం.డి ఇద్రీస్ అలీ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పోలీస్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

హాట్ లుక్ తో కిక్కెక్కిస్తోన్న ఇల్లీ బేబీ..నెట్టింట్లో ఫొటో వైరల్

భువనగిరి ఆస్పత్రిలో అనూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సకాలంలో ఆ పోలీస్ స్పందించకపోయుంటే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయుండేదో ఊహించడానికే కష్టం. ఎస్ ఐ ఇద్రీస్ సహాయానికి అనూష బంధువులు, భర్త కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులంటే కేవలం దండించడమే కాదు..సహాయం చేయడంలో కూడా ముందుంటారని చేసి చూపించారు.

నాగార్జునకి ఆ విషయంలో మంచి పట్టుందని చెప్పిన అమల

Next Story