లాక్ డౌన్ కారణంగా చిన్న, పెద్ద, పేద, ధనిక అన్న తేడాలు లేకుండా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీలు. అసలే రాకరాక వచ్చిన అవకాశమేమో..సమయాన్ని కించిత్ అయినా వృథా చేయట్లేదు. వంటలు చేస్తూ..ఆడుతూ పాడుతూ..పిల్లల్ని ఆడిస్తూ తీపి జ్ఞాపకాలను రూపొందించుకుంటున్నారు.

Also Read : కరోనాని తరిమేస్తాం అంటున్న మెగా ఫ్యామిలీ..

ఇటీవల ఓ మీడియా ప్రతినిధితో అక్కినేని అమల మాట్లాడారు. మీ కోడలు..అదే సమంత మీ కుటుంబం కోసం ఎప్పుడైనా వంటచేశారా ? అని ప్రశ్నించగా ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదని బదులిచ్చారు. అయినా నాగార్జునకు పాకశాస్త్రంలో మంచి పట్టు ఉంది. అంత అద్భుతంగా వంట చేసేవారుండగా ఇంకొకరిచేత వంట చేయించడం ఎందుకు ? తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. వంట విషయానికొస్తే నాక్కూడా రుచికరంగా వండటం రాదని చెప్పుకొచ్చారు అమల. నటనలోనే కాకుండా నాగార్జునకు ఈ టాలెంట్ కూడా ఉందా అని అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు.

Also Read : బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం

అలాగే లాక్ డౌన్ మొదలయ్యాక చైతూ రుచికరమైన వంట చేస్తున్నాడంటూ సమంత కూడా తన ఇన్ స్టా స్టోరీస్ లో ఫోటోలను షేర్ చేసింది. దక్షిణాదిన అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత 2017 లో చైతన్యను పెళ్లాడి అక్కినేనివారింట కోడలిగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ రియల్ కపుల్ లవ్ స్టోరీ సినిమాలో రీల్ కపుల్ గా సందడి చేయనున్నారు. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత సందడి చేయనుంది.

Chai Coocking

రాణి యార్లగడ్డ

Next Story