ఇలియానా..ఒకప్పుడు జీరో సైజ్ నడుముకు కేరాఫ్ అడ్రస్ ఈ భామ. ఇప్పుడు కాస్త కండ పెంచి చబ్బీగా తయారైంది గానీ అప్పట్లో మాత్రం జీరో సైజుకు ఐకాన్ ఇలియానా. దేవదాసుతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టిన ఇలియానా దేవదాసు, జులాయి, పోకిరి, జల్సా, భలే దొంగలు, కిక్ సినిమాలతో మంచి విజయాలనందుకుంది. 2018లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఊహించని రీతిలో ఫ్లాప్ అవ్వడంతో ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఇల్లీ బేబీ అడ్రస్ కనిపించలేదు.

Also Read : మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది

లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ఇలియానా గతంలో తీయించుకున్న ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా త్రో బాక్ మెమొరీ అంటూ ఇన్ స్టా లో షేర్ చేసిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో తెల్లటి పూలు ఆకారంలో ఉండే దుస్తులు ధరించిన ఇలియానా..తన హాట్ లుక్ తో యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒకేఒక్క సినిమా ఉంది. అదే ది బిగ్ ఫుల్. ఈ సినిమా ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది విడుదలవ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read : నాగార్జునకి ఆ విషయంలో మంచి పట్టుందని చెప్పిన అమల

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.