అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. చెప్పడానికి సిగ్గుపడను..

By అంజి  Published on  28 Feb 2020 6:56 AM GMT
అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. చెప్పడానికి సిగ్గుపడను..

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే హిరోయిన్‌ శ్రుతిహాసన్‌ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్టుతో పాటు తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రుతిహాసన్‌ గత కొంతకాలంగా రెస్ట్‌ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు శ్రుతిహాసన్‌ సిద్ధమైంది.

ఇటీవల శ్రుతిహాసన్‌ తాను దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ ఫొటోల్లో శ్రుతిహాసన్‌ సన్నగా, బక్క పల్చగా అయిపోయింది. నెటిజన్లు ఆమె ఫొటోలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వారికి ఘాటు సమాధానం ఇస్తూ శ్రుతిహాసన్‌ మరోపోస్టు చేసింది. తాను గతంలో నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని, ఎవరో చెప్పినట్లు తాను జీవించలేనని పోస్టులో తెలిపింది.

'నా ఇంతకుముందు పోస్టు తర్వాత ఈ పోస్టు చేస్తున్నానని.. ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా తాను నడవలేను. ఆమె చాలా లావుగా ఉంది.. ఇప్పుడు చాలా సన్నగా ఉంది అంటూ కామెంట్లు చేయడం సరైనది కాదు. ఈ రెండు ఫొటోలు మూడు రోజుల వ్యవధిలో తీసినవే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొనే సమస్యే. చాలా తరచుగా నేను హార్మోన్ల సమస్య కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా. కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది అంత సులభమైన విషయం కాదు. శారీరక మార్పులు అనేవి అంత సులభం కాదు.. కానీ నా ప్రయాణం గురించి చెప్పడం చాలా సులువు. ఒకరి స్థాయిని మరోకరు నిర్ణయించే స్థాయిలో ఎవరూ లేరు. ఇది నా జీవితం.. నా ముఖం అని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. అవును నాకు ప్లాస్టిక్‌ సర్జరీ జరిగింది. దానిని నేను అంగీకరించడానికి సిగ్గుపడను. నేను ప్రతిరోజు నన్ను ప్రేమించుకుంటున్నాను. మీరూ కూడా అలాగే చేయండి' అంటూ పోస్టులో పేర్కొంది.

Next Story
Share it