రెండేళ్ల త‌ర్వాత గ్రాండ్‌గా రీఎంట్రీ.. వారిదస‌లే సూపర్‌హిట్ కాంబినేష‌న్!

By Medi Samrat
Published on : 30 Oct 2019 2:20 PM IST

రెండేళ్ల త‌ర్వాత గ్రాండ్‌గా రీఎంట్రీ.. వారిదస‌లే సూపర్‌హిట్ కాంబినేష‌న్!

హైదరాబాద్: క‌మ‌ల్‌హాస‌న్ కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. శ్రుతి చివరిసారిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘కాటమరాయుడు’ లో న‌టించింది. అయితే తాజాగా శ్రుతి.. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించబోయే రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో క‌నిపించ‌నుంది.

Image result for shruti hassan raviteja balupu

ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 66వ చిత్రం. దీపావళి సందర్భంగా మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించారు. శ్రుతి, రవితేజ, గోపిచంద్ మ‌లినేని.. ఈ ముగ్గ‌రు కాంబోలో ఇంత‌కుముందు ‘బలుపు’ వంటి సూప‌ర్ హిట్ చిత్రం వ‌చ్చింది. దీంతో ఈ కాంబోపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. ఈ చిత్రానికి బి. మ‌ధు నిర్మాత‌.

Image result for lakshmi talk show shruthi hasan

ఇదిలావుంటే.. శ్రుతి ఇటీవలే లక్ష్మి మంచు నిర్వహించిన టాక్ షోలో కనిపించింది. ఈ షోలో.. శ్రుతి తన‌ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో విడిపోవడం.. విడిపోయిన తరువాత విప‌రీతంగా మద్యానికి బానిసయినట్టు తెలిపింది. అది ఆమె ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిందని వెల్ల‌డించింది. ఏది ఏమైనా నా వృత్తి, ప్ర‌వృత్తి ప‌ట్ల ఎవ‌రు ఏమ‌నుకున్నా 'ఐ డోంట్ కేర్స అని కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

Next Story