శ్రియా కాపురంలో కలకలం.. భర్తకు కరోనా..!
By తోట వంశీ కుమార్ Published on 14 April 2020 7:25 PM ISTప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఉంది. 1,70,000 పైగా కరోనా పాజిటివ్ కేసులతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఇక ఆదేశంలో ఈ మహమ్మారి భారీన పడి 18వేలమందికి పైగా మరణించారు.
టాలీవుడ్ హీరోయిన్ శ్రియా... పెళ్లి తరువాత ఆమె భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటుంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతుండడంతో ఆదేశం కూడా లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శ్రియా దంపతులు కూడా ఇంట్లోనే ఉంటూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. శ్రియా తన భర్తతో ఆండ్రీతో కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న వీడియోతో పాటు లాక్‌డౌన్‌లో ఎలా ఉంటున్న వీడియోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.
శ్రియా భర్త ఆండ్రీ ఆరోగ్య పరిస్థితి పై అనేక వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలపై శ్రియా స్పందించింది. తన భర్త పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిపింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి వెళ్లామని, డాక్టర్లు ఆండ్రీకి అన్ని పరీక్షలు నిర్వహించి ఇంటికి వెళ్లాలని సూచించారని చెప్పింది. ఒకవేళ ఆండ్రీ కి కొవిడ్-19 లేకపోయినట్లయితే.. ఆస్పత్రిలో ఉంటే.. త్వరగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని అందుకే వెంటనే ఇంటికి వచ్చామంది. ఇంట్లో స్పెల్ప్ క్వారంటైన్‌లో ఉంటున్నామని తెలిపింది. ఇంటి నుంచే వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇద్దరం చెరొక గదిలో ఉంటున్నామని, దేవుడి దయ వల్ల భర్త ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని చెప్పింది.