అమెరికాలో దారుణం: నెల్లూరు యువకునిపై కాల్పులు

By సుభాష్  Published on  12 April 2020 2:50 AM GMT
అమెరికాలో దారుణం: నెల్లూరు యువకునిపై కాల్పులు

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి చెందిన డేగా ధీరజ్‌రెడ్డి (28) శనివారం చికాగోలో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లాడు. దీంతో ధీరజ్‌రెడ్డిపై నల్ల జాతీయులు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ధీరజ్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

పదేళ్ల వయసు ఉండగానే తల్లిదండ్రులను కోల్పోయిన ధీరజ్‌, అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ధీరజ్‌రెడ్డి ..ఉన్నత విద్య కోసం జనవరిలో అమెరికి వెళ్లాడు. అక్కడ ఛారర్లెస్టోన్‌ ఈస్ట్రన్‌ ఇలినోయిస్ యూనివర్సిటీలో చేరాడు.

Next Story
Share it