గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..
By రాణి Published on 19 March 2020 5:34 AM GMTయావత్ ప్రపంచ మానవాళి మనుగడపై పగపట్టి మరి..వేలాది మందిని తన మృత్యు ఒడిలోకి చేర్చుకున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పటి వరకూ వైద్యులు, శాస్ర్తవేత్తలంతా ఇది మనిషి నుంచి మనిషికి స్పర్శ ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్ గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలిసింది. ప్లాస్టిక్ తో తయారైన వస్తువులపై, ప్లాస్టిక్ కారకాలపై కరోనా ఏకంగా మూడ్రోజుల పాటు క్రియాశీలకంగా ఉంటుందని..ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి మూల కారణం ప్లాస్టిక్ లో కరోనా వైరస్ 3 రోజుల పాటు ఉండగలిగే సామర్థ్యమేనని తేల్చింది.
Also Read : కరీంనగర్‌లో కరోనా కలకలం.. రంగంలోకి 100 ప్రత్యేక బృందాలు
అంతేకాదు మానవ శరీరం వెలుపల కూడా కరోనా వైరస్ మనుగడ సాగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు పరిశోధకులు. 2002-03 మధ్యలో సార్స్ విజృంభణకు కారణమైన సూక్ష్మజీవికి ఉన్న సామర్థ్యం ఇప్పుడు కరోనా వైరస్ లో కూడా ఉందని చెబుతున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
Also Read : ఏయ్ కేఏ పాల్.. ఈ సుత్తిసలహాలు ఇచ్చేబదులు..
కరోనా వైరస్ గాలిలో 3 గంటలు, రాగి సంబంధిత వస్తువులపై 4 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ పై 2-3 రోజులు సజీవంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి మార్కెట్ లో కొత్తగా వచ్చిన ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులను కొంతకాలం పాటు వాడకుండా ఉండటం ఆరోగ్యానికి మేలు అని సూచిస్తున్నారు.