ఇది చూసి దమ్ముంటే పొగ తాగండి

By అంజి  Published on  23 Nov 2019 5:50 AM GMT
ఇది చూసి దమ్ముంటే పొగ తాగండి

అవయవదానం చేసిన వ్యక్తి ఊపిరితిత్తులు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానానికి దూరంగా ఉండాలని ఎన్ని ప్రకటనలు చేసినా సరే ప్రజల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. అనారోగ్యం బారిన పడినా, ప్రాణాలు కోల్పోతున్నా దాని వలన నష్టాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకున్నా మారలేకపోతున్నారు. తాజాగా ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. డైలీ మెయిల్ కథనం ప్రకారం… చైనాలో 52 ఏళ్ళ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు…

అతని అవయవాలను మరణం తర్వాత దానం చెయ్యడానికి అంగీకరించడంతో… అతని ఊపిరిత్తులను బయటకు తీశారు. దాదాపు 30 ఏళ్ళ నుంచి ధూమపానం చేస్తున్న అతని లంగ్స్ నల్లగా, తారు పూసినట్టు ఉన్నాయి. డాక్టర్ చెన్ జింగ్యూ మరియు అతని వైద్య బృందం వాటిని గమనిస్తున్న సందర్భంగా… ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ ఊపిరితిత్తులు నల్లగా… ఎర్రగా ఉండటంతో… వాటిని మార్పిడి కోసం అంగీకరించలేదు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు ఎలా పాడవుతాయో చెప్పడానికి ఈ వీడియో చక్కని ఉదాహరణగా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 25 మిలియన్ల మందికి పైగా చూసారు.

Lungs

Next Story