సీఎంకు క‌రోనా పాజిటివ్‌..

By Medi Samrat  Published on  25 July 2020 7:33 AM GMT
సీఎంకు క‌రోనా పాజిటివ్‌..

క‌రోనా ఎవ్వ‌రిని వ‌ద‌ట్లేదు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని.. రిపోర్టులో పాజిటివ్ వ‌చ్చింద‌న్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ కరోనా వైరస్ సోకిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే కావ‌డం విశేషం.

శివరాజ్ సింగ్ చౌహాన్ త‌న ట్వీట్‌లో.. క‌రోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోండని విజ్ఞప్తి చేశారు.ఇదిలావుంటే.. వైద్యుల సూచనల మేరకు సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, కోవిడ్ -19 సమీక్షా సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని శివరాజ్ ప్రకటించారు.

Next Story
Share it