శివసేన రెండు ముక్కలైందా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 11:52 AM GMT
శివసేన రెండు ముక్కలైందా..?!

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అసెంబ్లీ గడువు ముగియడానికి మరో రెండ్రోజులు మాత్రమే గడువు ఉంది. గవర్నర్‌ను కలవడానికి ఫడ్నవీస్ సిద్ధమవుతున్నారు. అయితే..శివసేన పాచికలు ఇప్పటి వరకు పారినట్లు కనిపించలేదు. దీంతో..శివసేన మనసులో ఏదో భయం ఉన్నట్లు కనిపిస్తోంది. తమ ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించేందుకు శివసేన సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే..ఇంటర్నల్‌గా శివసేన రెండు గ్రూప్‌లుగా చీలినట్లు సమాచారం. ఒక వర్గం రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తుంటే..మరో వర్గం చెరో రెండున్నరేళ్లు పీఠం కోసం పట్టుబడుతుంది .క్యాంపులకు తరలించారని వార్తలు వస్తున్నాయి. అయితే..ఆ వార్తలను శివసేన నేతలు ఖండిస్తున్నారు.

సీఎం పదవిని పంచుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదు. ఇదే అవకాశంగా శివసేన చెలరేగిపోతుంది. సీఎం సీటు కోసం పట్టుబడుతుంది. కుమారుడు ఆదిత్య థాకరేను సీఎం పీఠం మీద చూసుకోవాలని ఉద్దవ్ థాకరే కలలు కంటున్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వం ఏర్పడకపోతే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది.

Next Story