ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు బెయిల్ మంజూరైంది. మనీలాండరింగ్ కేసులో శివ కుమార్‌ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రూ.25లక్షల పూచీకత్తుపై శివకుమార్‌కు బెయిల్ వచ్చింది. బెయిల్ ఇచ్చినందు వలన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంలేదని అడ్వొకేట్ సురేష్ కైత్ అభిప్రాయపడ్డారు.

అరెస్ట్ అయినప్పటి నుంచి శివ కుమార్ తీహార్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న శివ కుమార్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు . పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కేసులో డీకే కుమార్తె ఐశ్యర్యను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇక…నిన్ననే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి కూడా బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.