అయ్యో ధావ‌న్‌.. నువ్వు భార్యా బాధితుడివేనా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2020 5:16 PM IST
అయ్యో ధావ‌న్‌.. నువ్వు భార్యా బాధితుడివేనా..?

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తిగా స్తంభించింది. వైర‌స్ ముప్పుతో అన్ని క్రీడా టోర్నీలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో ప్ర‌స్తుతం టీమ్ఇండియా క్రికెట‌ర్లంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా కాలంగ‌డుపుత‌న్నారు. విరామం దొర‌క‌డంతో ఆట‌గాళ్లు సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాము చేస్తున్న ప‌నుల‌ను అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

టీమ్ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ త‌న కుటుంబ‌సభ్యుల‌తో ఎంజామ్ చేస్తున్నాడు. తాజాగా ఓ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్త ఎదుర్కొనే పరిస్థితులను సరదాగా చూపిస్తూ వీడియోను చేశాడు. ఈ వీడియోలో ధావన్‌ బట్టలు ఉతుకుతుండగా.. తన భార్య ఆయేషా ముఖర్జీ మేకప్‌ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయేషా ఫోన్‌ మాట్లాడుతూ కర్ర పట్టుకొని ధావన్‌తో బలవంతంగా టాయిలెట్‌ కడిగించింది.

ఈ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు ధావ‌న్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. ఇంకేముంది నెటీజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయ్యో ధావన్‌కు ఎంత కష్టమొచ్చే అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. కరోనా సెలవులను ధావన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని మరో అభిమాని కామెంట్ చేసాడు.

బ‌య‌ట క‌రోనా విల‌యం.. ఇంట్లో భార్య ప్ర‌ళ‌య తాండ‌వం. ప్ర‌తి భ‌ర్త ప‌రిస్థితి ఇలాగే అంటూ స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story